పదకోశం

సాధారణ

ద్విభాషా శిబిరంలు శిబిరంలను రెండు భాషల్లో నేర్పిస్తారు. విద్యార్థులు అందరూ రోజువారీ ధ్యానం సూచనలను రెండు భాషల్లో వినవచ్చు సాయంత్రం ప్రవచనాలను విడిగా వినవచ్చు.

పాత సాధకులు అనగా శ్రీ గోయెంక గారి లేదా తన సహాయక ఆచార్యుల ఆధ్వర్యంలో ఒక 10 రోజుల విపశ్యన ధ్యానం శిబిరం పూర్తి చేసిన వారు అని అర్థం.

పాత సాధకులకు పైన పేర్కొన్న శిబిరంలలో ధమ్మ సేవ అందించడానికి అవకాశం కలదు.

అన్ని శిబిరంలు విరాళాల ఆధారంగా మాత్రమే నడుస్తాయి. అన్ని ఖర్చులు శిబిరం పూర్తిచేసిన వాళ్ళు, విపశ్యన యొక్క ప్రయోజనాలు అనుభవించి, అదే అవకాశం ఇతరులకు కూడా అందాలని అనుకుంటున్న వారి విరాళ ద్వారా వచ్చిన ఆదాయంతోనే జరుగుతున్నాయి. ఆచార్యులు, సహాయక ఆచార్యులు కూడా ఆదాయం పొందరు. శిబిరాలలో సేవ చేసే వారు తమ సమయాన్ని ఐచిక్కంగా వెచ్చిస్తున్నారు. అందువలన విపశ్యన వ్యాపారీకరణ చేయకుండా ఉచితంగా నేర్పబడుతుంది.

ధ్యాన శిబిరంలు కేంద్రం మరియు కొన్ని కేంద్రం లేని ప్రాంతాలలో కూడా జరుగుతాయి. ధ్యానం కేంద్రాలలో శిబిరంలు ఏడాది పొడవునా క్రమం తప్పకుండా జరగడానికి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. ఈ సాంప్రదాయం లో ధ్యాన కేంద్రాలు స్థాపించబడడానికి ముందు, అన్ని శిబిరంలు, మత, విడిది కేంద్రాలు, చర్చిలు మరియు కాంప్ గ్రౌండ్ లు వంటి తాత్కాలిక ప్రాంతాలలో జరిగేవి. నేడు కేంద్రాలు ఏర్పాటు కాని ప్రాంతాల్లో, ఆయా ప్రాంతంలో నివసించే విపశ్యన స్థానిక విద్యార్థులచే 10 రోజుల ధ్యాన శిబిరంలు నిర్వహించబడుతున్నాయి.


శిబిర రకము:

పాత సాధకుల లఘు శిబిరంలు (1-3 రోజులు) శ్రీ గోయెంకా గారి లేక అతని సహాయక ఆచార్యులతో కానీ 10 రోజుల శిబిరం పూర్తి చేసిన సాధకుల కోసం మాత్రమే. పాత సాధకులు, తమ చివరి శిబిరం చేసి కొంత సమయం గడిచిన వారైనా సరే ఈ శిబిరంలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

10-రోజుల శిబిరాలు విపశ్యన ధ్యానము యొక్క పరిచయ శిబిరాలు. ఇక్కడ విపశ్యన ధ్యాన పద్ధతి ప్రతి రోజూ అంచెలంచెలుగా నేర్పించబడుతుంది. ఈ శిబిరాలు సాయంత్రము 2 - 4 గంటల తరువాత నమోదు మరియు వివరణ అయిన పిమ్మట మొదలవుతాయి. ఆ తరువాత 10 రోజుల సంపూర్ణ సాధన. 11వ రోజు ఉదయం 7:30 గంటలకు ముగియబడతాయి.

10-రోజుల ఎగ్జిక్యూటివ్ శిబిరాలు ప్రత్యేకంగా వ్యాపారవేత్తలు మరియు ప్రభుత్వ ఉద్యోగుల కొరకు నిర్వహించబడే విపశ్యన ధ్యాన పరిచయ శిబిరాలు. ఇక్కడ విపశ్యన ధ్యాన పద్ధతి ప్రతి రోజూ అంచెలంచెలుగా నేర్పించబడుతుంది. అధిక సమాచారము కొరకు క్రింది వెబ్ సైట్ చూడండి ఎగ్జిక్యూటివ్ శిబిరం వెబ్ సైట్.ఈ శిబిరాలు సాయంత్రము 2 - 4 గంటల తరువాత నమోదు మరియు వివరణ అయిన పిమ్మట మొదలవుతాయి. ఆ తరువాత 10 రోజుల సంపూర్ణ సాధన.11వ రోజు ఉదయం 7:30 గంటలకు ముగియబడతాయి.

పాత సాధకుల కోసం 10 రోజుల శిబిరాలు మామూలు 10 రోజుల శిబిరాల నియమావళి, కాల పట్టికనే కలిగి ఉంటాయి. ఈ శిబిరాలు గంభీర పూర్వ సాధకులు ఎవరైతే కనీసము మూడు 10 రోజుల శిబిరాలు, ఒక్క సతిపట్ఠాన శిబిరం పూర్తి చేసి మిగితా ఏ ధ్యానము సాధన చేయకుండా, కనీసము గత 1 సంవత్సరము, విపశ్యన ధ్యానం మాత్రమే ప్రతి దినం సాధన చేస్తూ, దైనందిన జీవితంలో పంచ శీలాలను పాటించడానికి ప్రయత్నిస్తున్న వారి కోసమే

ప్రత్యేక 10 రోజుల శిబిరాలు గంభీర పూర్వ సాధకులు ఎవరైతే కనీసము ఐదు 10 రోజుల శిబిరాలు, ఒక్క సతిపట్ఠాన శిబిరం, కనీసము ఒక్క 10 రోజుల శిబిరంలో సేవను పూర్తి చేసుకుని మరియు నియమబద్ధంగా కనీసము గత 2 సంవత్సరాలు ఈ ధ్యానము మాత్రమే సాధన చేస్తున్న వారికోసమే

20 రోజుల శిబిరాలు కనీసము ఐదు 10 రోజుల శిబిరాలు, ఒక్క సతిపట్ఠాన సుత్త శిబిరం, కనీసము ఒక్క 10 రోజుల శిబిరంలో సేవ చేసి, కనీసము 2 సంవత్సరాలు నియమ బద్ధంగా సాధన చేస్తూ ఈ ధ్యాన పద్ధతికే కట్టుబడి ఉన్న గంభీర సాధకుల కొరకు మాత్రమే .

30-రోజుల శిబిరాలు కనీసము ఆరు 10 రోజుల శిబిరాలు(మొదటి 20 రోజుల శిబిరం తరవాత ఒకటి), ఒక్క 20-రోజుల శిబిరం, ఒక్క సతిపట్ఠాన సుత్త శిబిరం పూర్తి చేసి కనీసము 2 సంవత్సరాలు నియమ బద్ధంగా సాధన చేస్తూ ఈ ధ్యాన పద్ధతికే కట్టుబడి ఉన్న గంభీర సాధకుల కొరకు మాత్రమే.

45-రోజుల శిబిరాలు కనీసము ఏడు 10 రోజుల శిబిరాలు (మొదటి 30 రోజుల శిబిరం తరవాత ఒకటి), రెండు 30-రోజుల శిబిరాలు, ఒక్క సతిపట్ఠాన సుత్త శిబిరం చేసి, కనీసము 3 సంవత్సరముల వరకు నియమ బద్ధంగా సాధన చేస్తూ, ధమ్మ సేవలో నిమగ్నమయి ఉన్న వారు లేక సహాయక ఆచార్యుల కొరకు మాత్రమే.

60-రోజుల శిబిరాలు కనీసము రెండు 45 రోజుల శిబిరాలు చేసి, సంవత్సరానికి కనీసము 4 శిబిరాలు నిర్వహించే ఆచార్యులు, సహాయక ఆచార్యుల కొరకు మాత్రమే.

పిల్లల శిబిరాలు, 8 నుండి 12 సంవత్సరముల వయస్సు ఉండి ధ్యానము నేర్చుకోవాలన్న కోరిక గలిగిన పిల్లల కొరకు. వాళ్ళ తల్లిదండ్రులు విపశ్యన సాధకులు అగుట ఆవశ్యకము కాదు.

పాత సాధకుల కార్యక్రమములు క్రింది వాటిని పోలియుండును సేవా కార్యక్రమములుఇచ్చట కేంద్రము యొక్క వివిధ రకములైన నిర్వహణ, నిర్మాణ, ఆంతరంగిక మరియు తోట పనులలో సేవనందించుటకు సమయము ఉండును. కానీ ఇది సంపూర్ణంగా క్రమబద్ధంగా నిర్వహించబడుతుంది. ఇచ్చట సహాయక ఆచార్యులను కలుసుకోవచ్చును, ఇంకా కమిటీ మరియు ట్రస్టు సమావేశములలొ పాల్గొనే అవకాశము కూడా లభించవచ్చు. అందరు పాత సాధకులు ఈ కార్యక్రమాలకు ఆహ్వానితులే. దైనందిన కార్యక్రమములో మూడు సామూహిక సాధనలతో పాటు ఉదయం, మధ్యాహ్నం సేవా సమయములు ఉంటాయి మరియు సాయంకాలము సత్యనారాయణ గోయెంక గారిచే పాత సాధకులను ఉద్దేశించి ఇచ్చిన ప్రత్యేక ప్రవచనాలు మరియు ఉపన్యాసములు వినిపించబడతాయి.

అవగాహన శిబిరాలు - ధ్యాన శిబిరముల మధ్య నిర్వహించబడును. విపశ్యన ధ్యానము గురించి, ధ్యాన కేంద్రముల గురించి అవగాహన పొందడానికి అందరూ ఆహ్వానితులే

సతిపట్ఠాన సుత్త శిబిరము 10 రోజుల శిబిరము కాలపట్టిక మరియు నియమావళిని పోలి ఉండును. తేడా ఏమిటంటే సాయంత్రపు ప్రవచనాలలో సతిపట్ఠాన సుత్త జాగ్రత్తగా పరిశీలించబడుతుంది. ఈ సుత్తలో విపశ్యన ధ్యాన విధానము సక్రమముగా వివరించబడింది. ఈ శిబిరములు కనీసము మూడు 10 రోజుల శిబిరములు (సేవ ఇచ్చిన శిబిరములను మినహాయించి) చేసి, చివరి 10 రోజుల శిబిరము తరువాత ఇతర ఏ ధ్యాన పద్ధతినీ అనుసరించకుండా, విపశ్యన ధ్యాన సాధనను గత ఒక్క సంవత్సరము నుండి చేస్తూ, తమ సాధనలో నిరంతరతను నిలుపుకునే ప్రయత్నంలో ఉండి, పంచ శీలాలను తమ నిత్య జీవనంలో పాటిస్తున్న గంభీర పాత సాధకుల కొరకు నిర్దేశించబడినవి.

పాత సాధకుల స్వీయ శిబిరము, 10 రోజుల శిబిరము యొక్క కాలపట్టిక మరియు నియమావళిని పోలి ఉండును. తేడా ఏమిటంటే ఇక్కడ ఆచార్యుల ఉపస్థితి ఉండదు. ఈ శిబిరములు కనీసము మూడు పది రోజుల శిబిరములలో సాధన చేసి, క్రిందటి 10 రోజుల శిబిరము తరువాత ఇతర ఏ ధ్యాన పద్ధతినీ అనుసరించకుండా, విపశ్యన ధ్యాన సాధనను గత ఒక్క సంవత్సరము నుండి చేస్తూ, తమ సాధనలో నిరంతరతను నిలుపుకునే ప్రయత్నంలో ఉండి, పంచ శీలాలను తమ నిత్య జీవనంలో పాటిస్తున్నగంభీర పాత సాధకుల కొరకు నిర్దేశించబడినవి.

సేవా సమయము వివిధ రకములైన కేంద్ర నిర్వహణ, నిర్మాణ, ఆంతరంగిక మరియు తోట పనుల కొరకు కేటాయించబడినది. పాత సాధకులు అందరూ దీనికి ఆహ్వానితులే. దైనందిన కార్యక్రమములో మూడు సామూహిక సాధనలతో పాటు ఉదయం, మధ్యాహ్నం సేవా సమయములు ఉంటాయి మరియు సాయంకాలము సత్యనారాయణ గోయెంక గారిచే పాత సాధకులను ఉద్దేశించి ఇచ్చిన ప్రత్యేక ప్రవచనాలు మరియు ఉపన్యాసములు వినిపించబడతాయి.

కిశోర ఆనాపాన శిబిరములు 13-18 సంవత్సరముల మధ్య వయస్సు కలిగిన వారి కొరకు నిర్దేశించబడినవి. వాళ్ళ తల్లిదండ్రులు విపశ్యన సాధకులు అగుట ఆవశ్యకము కాదు.