గోప్యతా విధానం

విపశ్యన వెబ్ సైట్నుసందర్శించినందుకు ధన్యవాదములు. మీ గోప్యత మా సంస్థలకు ముఖ్యం. మీ గోప్యతను మంచిగా పరిరక్షిచడానికి, మేము మా సమాచార పద్దతులను చెబుతూ ఈ గమనికను అందిస్తున్నాము. మరియు మా సైట్స్, మా సంభందిత సంస్థలలో మీ సమాచారాన్ని ఎలా సేకరిస్తామో ఎలా ఉపయోగిస్తామో మీరు తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా సంస్థల గోప్యత విధానాల నిర్దిష్ట వివరాలు వేరు వేరు దేశాలలో వేరుగా ఉండవచ్చు. మీ సమాచారానికి సంభందించిన, నిర్దిష్ట గోప్యత విధానం యొక్క నకలు ప్రతిని, విపశ్యన శిబిర రిజిస్ట్రార్ లేదా శిబిర కేంద్ర వద్దకు మీరు చేరాక పొందవచ్చు.

మేము సేకరించే సమాచారం

మీరు మా ఆన్ లైన్ లేదా సంప్రదాయ దరఖాస్తు ద్వార విపశ్యన ధ్యాన శిబిరం కోసం నమోదు చేసుకో తలిస్తే మీ వ్యక్తిగత సమాచారం దరఖాస్తు పత్రం ద్వార సేకరిస్తాము. ఈ సమాచారం లో పేరు, చిరునామా, ఇమెయిల్ చిరునామా, టెలిఫోన్ నంబర్, ఫాక్స్ నంబర్ వంటివి ఉండవచ్చు. శిబిరా దరఖాస్తు పత్రం లేదా నమోదు పత్రం లో ఉన్న మీ వ్యక్తిగత సమాచారం మా అదుపులో సురక్షితంగా భద్రపరచ బడుతుంది. ఈ సమాచారం చూడటానికి "తెలుసుకోవాలి అనే అవసరం ఉన్న" శిబిర రిజిస్ట్రార్, కేంద్ర/ శిబిరా నిర్వాహకులు, సహాయక ఆచార్యులు, శిబిర ఆచార్యులు వంటి వారికి మాత్రమే అనుమతి ఉంటుంది.

మీరు మా "విపశ్యన గురించి ఒక స్నేహితునికి చెప్పండి" అనే సదుపాయం ఉపయోగించుకో తలిస్తే, మీరు తప్పనిసరిగా మీ ఇద్దరి వ్యక్తిగత ఈ మెయిల్ చిరునామాలను మాకు అందించ వలసి ఉంటుంది. దీని ద్వార మేము వ్యక్తిగత శుభాకాంక్షలు, మా వెబ్ సైట్ చిరునామాతో వారికి పంపుతాము. ఈ సేవ ద్వార మేము మిమ్మల్ని మరియు ఇతర వ్యక్తి యొక్క వ్యక్తిగతంగా గుర్తించ గలిగే ఈ మెయిల్ చిరునామాలు మాత్రమే సేకరిస్తాము. మీరు మా వెబ్ సైట్ సందర్శించినప్పుడు వ్యక్తిగతం కాని సమాచారం - మీరు ఉపయోగిస్తున్న బ్రౌజరు (ఉదా|| ఫైరుఫాక్సు, నెట్స్కేప్, ఓపెరా లేదా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్), మీరు ఉపయోగిస్తున్న ఆపరేటింగ్ సిస్టం (ఉదా|| విండోస్, మాక్ ఓస్ లేదా లినక్సు) మరియు మీకు ఇంటర్నెట్ సదుపాయం అందిస్తున్న వారి డొమైన్ పేరు (ఉదా|| అమెరికా ఆన్లైన్, ఎర్త్లింక్ ) వంటి సమాచారం కూడా సేకరించవచ్చు.

మేము మీ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాము

మీ దరఖాస్తు పత్రంలో మీ గురించి, మీరు సంపర్పించిన మీ సమాచారం, ఆ శిబిరంలో మీ ప్రవేశానికి మీ దరఖాస్తును విశ్లేషించడానికి మరియు శిబిరంలో నమోదుకు ఉపయోగిస్తాము. అంతేకాకుండా, ఎవరైతే విపశ్యన శిబిరాలలో తరచుగా పాల్గొంటూ ఉంటారో, వారు తదుపరి శిబిరాలు కూడా వారి జీవిత కాలం హాజరు అవుతూ ఉంటారు. తదుపరి శిబిరాలలో ప్రవేశం సులభతరం చేయడానికి, మరియు సాధకుల చరిత్ర మరియు అనుభవం భద్రపరచడం కొరకు మేము ప్రతి సాధకుని శిబిర సమాచారం, చట్టపరమైన నిషేధం ఏది లేకుంటే మేము ఆ సమాచారాన్నినిరవధికంగా భద్ర పరచవచ్చు. కొన్ని సార్లు మేము మీ పేరు, చిరునామా లేదా ఈ మెయిల్ చిరునామాను, విపశ్యన సంభందించిన కార్యక్రమాలు గురించి పంపడానికి ఉపయోగించవచ్చు. "ఒక స్నేహితునికి చెప్పండి" సదుపాయం ద్వార మీరు అందించిన సమాచారాన్ని, వారికి శుభాకాంక్షలు మరియు మా వెబ్ సైట్ వివరాలు పంపడానికి ఉపయోగిస్తాము. కొన్ని సార్లు మా వెబ్ సైట్ నమూనా, అందులోని విషయాలు మెరుగు పరచడానికి, మా వెబ్ సైట్ ద్వార వ్యక్తిగతంగా గుర్తించ లేని వివరాలు సేకరించవచ్చు. ఈ వివరాలు మాకు, మా సైట్ను ఎవరు, ఏ ప్రాంతం నుండి చూస్తున్నారు మరియు సైటులో ఎటువంటి పేజిలు చూస్తున్నారు అనే విషయాలు విశ్లేషించడానికి ఉపయోగిస్తాము. విపశ్యన వెబ్ సైట్ ఎప్పుడు మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు లేదా వ్యాపార లక్ష్యాల కోసం లేదా ఏ ఇతర ప్రయోజనాల కోసం ఉపయొగించదు. అయితే కొన్ని ప్రాంతీయ వెబ్ సైట్లలో మా సంస్థ క్రెడిట్ కార్డు ఆధార విరాళాలు స్వీకరించవచ్చు. అటువంటి సందర్భాలలో ఆ విరాళాలకు సంభందించిన ఆర్ధిక లావాదేవీలు, వ్యక్తిగత సమాచారం సాధారణ పద్ధతిలోనే ప్రాసెస్ చేయబడుతాయి. లేక పోతే మీ వ్యక్తిగత సమాచారం మా సంస్థ, దాని అనుభంద సంస్థలు మరియు వాటి ఉమ్మడి నిర్మాణాలు బయట బహిర్గతం చేయము. న్యాయ పరంగా అలా అవసరం అయితే తప్ప, అంటే న్యాయస్థానం ఆదేశిస్తే లేదా దావా వల్ల. చట్టం అమలు చేసే సంస్థ అబ్యర్థనకు ప్రతిస్పందనగా లేదా ఇతర చట్టపరమైన అవసరాల కోసం మీ సమాచారం తెలియ చేయవచ్చు.

విపశ్యన యొక్క అందరు ఆచార్యులు మరియు సహాయక ఆచార్యులు అలాగే అన్ని ధ్యాన కేంద్రాల సిబ్బంది మరియు దమ్మ సేవకులకు మాత్రమే, "తెలుసుకోవాలి అనే అవసరం" ఉంటె మాత్రమే శిబిర దరఖాస్తు లేదా నమోదు పత్రాలలో ఉన్న మీ సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇటువంటి సమాచారం ఒకసారి మీరు సమర్పించిన కేంద్రం లేదా కేంద్రం కాని శిబిర రిజిస్ట్రార్కు చేరిన వెంటనే ఆ సమాచారం, ఇంకెవరికి తెలియకుండా ఉండే విధంగా పరిరక్షింప బడుతుంది. కాని మీరు నమోదు చేసుకున్న శిబిరం ఉన్న దేశం యొక్క నిర్దిష్ట గోప్యత విధానాలను బట్టి, మీ సమాచార నిల్వ, సంరక్షణ మరియు ఉపయోగం నిర్దేశించ బడుతుంది. కొన్ని సందర్భాలలో మన ఈ మెయిల్ సదుపాయాలు అంత సురక్షితంగా ఉండక పోవడం వల్ల, మీరు సమర్పించిన సమాచారం ఇంటర్నెట్ ద్వార పంపబడటం వల్ల బహిర్గతం అయ్యే ఒకే ఒక ప్రమాదం ఉంది. మీరు వ్యక్తిగతంగా మీ ప్రమాదానికి సిద్దం అయితే తప్ప, ఈ వెబ్ సైట్ ద్వార ఈ మెయిల్ సదుపాయం దయచేసి ఉపయోగించ వద్దు.

దరఖాస్తు పత్రాలు మరియు అందులో ఉన్న సమాచారం మా కంప్యూటర్లలో భద్రపరచాబడుతాయి. అంతే కాకుండా మా కంప్యూటర్లు ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్నాయి. మా శిబిరాలలో ఒక శిబిరం హాజరు కావడానికి, దరఖాస్తు సమర్పించడం ద్వార, మీ దరఖాస్తు పత్రాన్ని మా కంప్యూటర్లలో భద్రపరచడానికి, ప్రాసెస్ చేయడానికి మరియు సీమంతరాలకు దరఖాస్తు పత్రంలో ఉన్న మీ వ్యక్తిగత సమాచారాన్ని బదిలీ చేయడానికి మీ నిస్సందేహ సమ్మతి తెలియజేస్తున్నారు. అలాగే నమోదు ప్రక్రియలో మీరు సమర్పించిన సమాచార నిల్వ మరియు నిర్వహణ స్థానిక న్యాయపరిధి గోప్య నియంత్రణలకు అనుగుణంగా ఉంటుంది. అంతే కాకుండా కొన్ని సందర్భాలలో మీరు దరఖాస్తు సమర్పించిన కేంద్రం యొక్క ఈమెయిలు సదుపాయం గూగుల్ యప్స్ ద్వార అందించబడి ఉండవచ్చు. దాని ఫలితంగా ఆ కేంద్రానికి సమర్పించిన మీ దరఖాస్తు పత్రంలోని సమాచారం గూగుల్ గోప్యత మరియు భద్రత నియమాలకు అనుగుణంగా నిర్వహించ బడుతుంది. సాధకుల సంక్షేమం కొరకు వారి ఆరోగ్య సమస్యలు లేదా క్రమశిక్షణ నియమావళికి విరుద్ధంగా ఉన్న వారి ప్రవర్తన లేదా భవిష్యత్లో పాల్గోనకూడని లేదా అదనపు సహాయం అవసరమైయ్యె సాధకుల గురించి సూచనలను మేము తీసుకొని భద్ర పరచ వచ్చు. ఇలా అరుదుగా జరిగే సందర్భాలలో, ఇలా భద్ర పరచిన సూచనలను భవిష్యత్తు శిబిరాలలో, సహాయక ఆచార్యులు లేదా శిబిరా నివహకులకు గోప్యంగా అందించవచ్చు. మీ శిబిర హాజరు అటువంటి సూచనలను భద్ర పరచడానికి మరియు సీమంతరలాకు బదిలీ చేయడానికి మీ నిస్సందేహ సమ్మతిని తెలియ చేస్తుంది.

ఇతర సంస్థల సైట్ల ద్వారా సమాచార సేకరణ

ఈ గోప్యత విధానం, మేము మీ నుండి సేకరించిన సమాచారం యొక్క ఉపయోగం మరియు వ్యాప్తిని మాత్రమే సంభోదిస్తుంది. మా వెబ్ సైట్, ఇతర వెబ్ సైట్స్ లింక్స్ కలిగి ఉండవచ్చు. ఆ సైట్స్ యొక్క సమాచార అభ్యాసాలు, మా అభ్యాసాల నుండి భిన్నంగా ఉండవచ్చు. సందర్శకులు ఆ సైట్స్ యొక్క గోప్యత విధానాలను తప్పక చూడాలి. విపశ్యన సంస్థ ఇతర వెబ్ సైట్స్ యొక్క గోప్యత విధానాలను నియత్రించదు కాబట్టి మీరు ఆ గోప్యత ఆచారాలు మరియు విధానాలు ఏవైనా ఉంటె, వాటికి లోబడి ఉంటారు. మరియు ఆ విపశ్యన సంస్థకు ఆ సైట్స్ లోని మీ వ్యక్తిగత సమాచారం ఉపయోగం లేదా వ్యాప్తికి ఎటువంటి భాద్యత లేదు. అందువలన మేము మిమ్మల్ని, ఇతరులకు మీ వ్యక్తిగత సమాచారం బహిర్గతం చేసే ముందు ప్రశ్నలు అడగమని ప్రోత్సహిస్తాము.

కుకీలు

కుకీ అంటే, మీరు మా వెబ్ సైట్ సందర్శించినప్పుడు మా సర్వర్ నుండి మీ వ్యక్తిగత కంప్యూటర్కు డౌన్లోడ్ అయ్యే కొన్ని వివరాలు ఉన్న ఒక టెక్స్ట్ ఫైల్. ఈ ఫైల్లో ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది. మీరు మా శిబిరంకు నమోదు చేసుకోవడానికి మా వెబ్ సైట్ సందర్శించినప్పుడు ఇలాంటి కుకీ సృష్టిస్తాము. మీరు పాత సాధకులుగా సందర్సిస్తున్నారో లేదో తెలుసు కోవడానికి ఒక సెషన్ కుకీ సృష్టిస్తాము. కొన్ని కుకీలు మీరు మా వెబ్ సైట్ చూస్తూ ఉన్న కాలం వరకే ఉంటాయి. ఇవి మీరు బ్రౌజరు మూసివేసినప్పుడు తొలగించబడుతాయి. మరి కొన్ని ప్రాంతీయ విపశ్యన వెబ్ సైట్లు కుకీలు ఉపయోగిస్తూ ఉండవచ్చు.

పిల్లల గోప్యతా

మా విపశ్యన సంస్థలు ప్రత్యేకంగా పిల్లల గురించి సమాచారాన్ని సేకరించవు, కానీ మేము పిల్లల భద్రత మరియు ఇంటర్నెట్ వాడకం పట్ల జాగ్రత్త వహిస్తాము.అందువలన, 1998 సంయుక్త బాలల ఆన్ లైన్ గోప్యతా పరిరక్షణ చట్టం (మరియు ఇతర దేశాలలో పోల్చదగిన చట్టం) ప్రకారం, మేము తల్లిదండ్రుల అనుమతి లేకుండా 13 ఏళ్ళ లోపు వయస్సుగల పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ కూడా అభ్యర్తించము. ఒకవేళ అటువంటి అలాంటి వ్యక్తిగత సమాచారం సేకరించినట్లు మా దృష్టికి వచ్చినచో మేము వెనువెంటనే ఆ సమాచారాన్ని మా డేటాబేస్ నుండి తొలగిస్తాము.

నిర్దిష్ట దేశీయ గోప్యతా అవసరాలు

వివిధ దేశాలు, నిర్దిష్ట గోప్యత చట్టాలు కలిగి ఉండవలసిన అవసరం ఉందని దయచేసి గమనించండి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా విపశ్యన సంస్థలు, ఆయా దేశాల చెట్టాల ప్రకారం నిర్దిష్ట గోప్యత విధానాలు రూపొందించాబడ్డాయి. అవి నిర్దిష్ట వివరాలలో పైన పేర్కొన్న సాధారణ విధానాల నుండి వేరుగా ఉండవచ్చు . ఈ నిర్దిష్ట వివరాల యొక్క ప్రతిని పొందటానికి మీరు దరఖాస్తు చేసుకున్న శిబిర రిజిస్ట్రార్ లేదా కేంద్రాన్నిసంప్రదించండి లేదా మీరు శిబిరాన్ని చేరిన తరువాత పొందవచ్చు.

ఎంపిక చేసుకోండి/ విరమించుకొండి

మీరు మీ మా విపశ్యన సంస్థలు, మా సేవలు లేదా విపశ్యన గురించిన సమాచారం గురించి పంపించే ఈ మెయిల్ లేదా పోస్ట్స్ నుంచి విరమించుకొనె అవకాసం మేము అందిస్తున్నాము. మీరు మీ పేరు, ఈమెయిలు చిరునామా మరియు ఇతర వ్యక్తిగత సమాచారం మా డేటాబేస్ నుండి పూర్తిగా తొలగించాలి అని అనుకుంటే ఈ క్రింది ఈ మెయిల్ కు, ఈ మెయిల్ పంపండి : database-remove@dhamma.org. మీరు మీ ప్రాంతీయ విపశ్యన కేంద్రంను కూడా సంప్రదించవచ్చు.

మమ్మల్ని సంప్రదించడం ఎలా

మీకు విపశ్యన వెబ్ సైట్ లేదా దాని అమలు యొక్క గోప్యత లేదా మరి ఏ ఇతర విధానాల గురించి ప్రశ్నలు లేదా అనుమానాలు ఉంటే, మమ్మల్ని వెబ్మస్తెర్@ధమ్మ.ఒర్గ్ ద్వార సంప్రదించ వచ్చు.

అమలుపరిచే తేదీ

ఈ గోప్యతా విధానం నవంబర్ 1, 2001 నుండి అమలులో ఉంది. మా విపశ్యన సంస్థలకు ఏ సమయంలోనైనా మా స్వంత అభీష్టానుసారం ఈ విధానం యొక్క నిబంధనలను సవరించడానికి పూర్తి హక్కులు కలవు. ఈ వెబ్సైట్ ను మీరు ఉపయోగించడం ద్వారా పైన ప్రస్తావించిన విధానాలకు మీరు లోబడినట్లు మీ అంగీకారాన్ని ఏర్పరుస్తుంది.